20నుంచి ‘ఓపెన్‌’ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

20నుంచి ‘ఓపెన్‌’ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

20నుంచి ‘ఓపెన్‌’ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్‌లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5–30గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్‌లో 3,945మంది విద్యార్థులకునుగాను 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 197మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్‌లో 7,187మందికిగాను 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 359మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎ.సదానందం శుక్రవారం తెలిపారు. హాల్‌టికెట్లు సంబంధిత వెబ్‌సైట్‌(తెలంగాణఓపెన్‌స్కూల్‌.ఓఆర్‌జీ)లో అందుబాటులో ఉంచారని, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు కోరారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

టెన్త్‌లో 3,495 మంది..

ఇంటర్‌లో 7,187 మంది విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement