ఏటూరునాగారం: విద్యార్థులు ఒక లక్ష్యంతో చదవాలని ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్, పీపుల్ ఫర్ యాక్షన్ ఎన్‌జీఓ కెరీర్ కౌన్సిలర్ ట్రైనర్ కిషోర్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు కెరీర్ విజనింగ్ వర్క్‌షాప్ నిర్వహించి భవిష్యత్‌లో ఎలాంటి చదువులు, ఉద్యోగులు పొందాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి 35 పాఠశాలల నుంచి 350 మంది విద్యార్థులు హాజరయ్యారు. వర్క్‌షాప్‌లో నిర్వహించిన సెషన్ ద్వారా విద్యార్థులు తమ వ్యక్తిగత బలాలు, ఆసక్తులు గుర్తించుకోవడంతోపాటు పదో తరగతి అనంతరం ఎంచుకోవాల్సిన సరైన వృత్తి మార్గాలపై స్పష్టమైన అవగాహన పొందారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యార్థులకు భవి ష్యత్ నిర్మాణంలో వారి ప్రాముఖ్యంపై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సాంబశివరావు, ఉపాధ్యాయులు శ్రావణ్, రాజన్న, నాగరాజు, మాదురి, తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో రాణించాలి
పదోతరగతి ముగిసిందని విశ్రమించకుండా నిరంతరం క్రమశిక్షణతో భవిష్యత్‌లో రాణించాలని డీఈఓ సిద్దార్ధరెడ్డి అన్నారు. ములుగు మండలం బండారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో కెరీర్ గైడ్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతీరోజు విద్యార్థిగానే ఉండాలని, చదువుతోపాటు సమాజం, దేశం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు, గురువుల మాటలు విని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు.


