వాటర్ ప్లాంట్ ఎక్కడ?
ఈ నెల 20న నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.
అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వచ్చాం. ఆస్పత్రిలో తాగునీరు ఎక్కడ ఉందనే విషయం తెలియదు. దాహం తీర్చుకునేందుకు రూ.20లతో వాటర్ బాటిల్ కొనుగోలు చేశా. వాటర్ ప్లాంట్ ఎక్కడ ఉందనే విషయం తెలిసేవిధంగా బోర్డులు ఏర్పాటు చేయాలి.
– రమ్య, వెంకటాపురం (ఎం)
గతంలో ఆస్పత్రిలో ఇన్‌వార్డు పేషెంట్‌లకు అందుబాటులో ఆర్‌ఓ ప్లాంట్ ఉండేది. ఆస్పత్రి అప్‌గ్రేడ్ అయిన తర్వాత వాటర్ ప్లాంట్‌ను ఆస్పత్రి ఆవరణలోని జనరిక్ మందులషాపు పక్కన ఏర్పాటు చేశారు. అయితే ఆస్పత్రిలో తాగునీరు ఎక్కడ దొరుకుతుందనే విషయానికి సంబంధించి ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అటెండెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమి లేక రూ.20 పెట్టి వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తాగుతున్నారు. ఆస్పత్రిలో గతంలో వేసిన బోర్ సహాయంతో వాటర్ ప్లాంట్ నిర్వాహన కొనసాగుతుంది. ఇటీవల కాలంలో ఎలాంటి బోర్లు వేయించలేదు.


