సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మైపతి అరుణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని గంగారం పంచాయతీ పరిధిలోని భూపతిపూర్‌ సమీపంలో కారుకొండా సడాలమ్మ జాతరను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు కొర్నెబెల్లి గణేష్‌, చింత రమేష్‌, కొమరం రవి, సర్వేష్‌ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న వాలీబాల్‌ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీల ఇలవేల్పు జాతరల రక్షణకు కృషి చేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మొదటి బహుమతి రూ. 25,016, ద్వితీయ బహుమతి రూ.15,016, తృతీయ బహుమతి రూ.10,016, నాలుగో బహుమతి రూ.5,016, ఐదో బహుమతి రూ.3,016లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బడే రజిత రాంబాబు, యువజన సంఘాల అధ్యక్షుడు నవీన్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement