వెంకటాపురం(ఎం): మండలంలోని నల్లగుంటలో గురువారం రాత్రి హిందూ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జనగాం రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళానికి శాంబవీ పీఠాధిపతి భువనగిరి బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హిందూ అనేది మతం కాదని.. హిందూ ధర్మం ఒక జీవన విధానం అన్నారు. మన సనాతన ధర్మం మనకందించిన గొప్ప జీవన విధానమని వెల్లడించారు. మనమంతా హిందూధర్మాన్ని ఆచరించాలని, ధర్మాన్ని కాపాడే వారసులుగా మనందరం కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్మిలారెడ్డి, విఘ్నేష్‌జీ, సర్పంచ్ భూక్య శ్రీదేవి, కార్యక్రమ నిర్వహకులు శిరూప సతీష్ కుమార్, భూక్య జవహర్ లాల్, రామగిరి శ్రీనివాస్, కొండ్ల కృష్ణమూర్తి, ఉత్సవ కమిటీ సభ్యులు మేరుగు మల్లయ్య, కాంతాల నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


