ములుగు రూరల్: రోడ్డు భద్రతా నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని అడిషనల్ ఎస్పీ సదానందం అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో వాహనదారులకు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించామన్నారు. చిన్నచిన్న నిర్లక్ష్యాల కారణంగా పెద్ద ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కిశోర్‌కుమార్, సీఐ సురేశ్‌కుమార్, ఎస్సై ఉపేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ ఎస్పీ సదానందం


