హన్మకొండ కల్చరల్: ఈ నెల 19వ తేదీ నుంచి 12 రోజుల పాటు జరుగనున్న శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు దేవాలయం ముస్తాబవుతోంది. ఆలయాన్ని సందర్శించే భక్తులు ఎండతాకిడితో ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు అయ్యే ఖర్చు రూ.10 లక్షలను విరాళంగా ఇస్తానని గత మార్చి 27న దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు గురువారం జర్మన్ పెండల్స్ టెంట్లు వేయిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి వాహనసేవ కోసం వాహనాలను శుభ్రపర్చి సిద్ధం చేశారు. ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఏర్పాట్లు పర్యవేక్షించారు.


