రామప్ప దేవాలయంలో అధికారులు | - | Sakshi
Sakshi News home page

రామప్ప దేవాలయంలో అధికారులు

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

రామప్ప దేవాలయంలో అధికారులు

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్‌ సెక్రటరీ సర్వీస్‌కు చెందిన 70 మంది అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ సందర్శించారు. భారత్‌ దర్శన్‌లో భాగంగా వారు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. వారి వెంట కోర్స్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని డీఆర్‌డీఓ చంద్రశేఖర్‌ సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement