ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి సూచించారు. ఈ మేరకు గురువారం మల్లంపల్లి మండల పరిధిలోని కొడిశలకుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు. నిర్వాహకులు కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేంద్రాలలో గన్ని బ్యాగులు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ చంద్రశేఖర్, ఆత్మ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఏపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి


