గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు పాటుపడాలి

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు పాటుపడాలి

ములుగు రూరల్‌: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జాన్‌–స్నో ఇండియా కమిషనర్‌ డేవిడ్‌ అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న హెచ్‌వీపీ కార్యక్రమాన్ని ఆయన గురువారం పరిశీలించి మాట్లాడారు. 14ఏళ్లు నిండిన విద్యార్థినులకు వ్యాక్సినేషన్‌ వేయాలని సూచించారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని తెలిపారు. బాలికల తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను తొలగించాలని వెల్లడించారు. ములుగు, వెంకటాపురం(ఎం), ఎస్‌ఎస్‌ తాడ్వాయి, గోవిందరావుపేట, పస్రాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న విద్యార్థినులను అభినందించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పెంచాలని సూచించారు. విద్యాశాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థినులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, వ్యాధి నిరోధక టీకా నియంత్రణ అధికారి నాగ అన్వేశ్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌, సంపత్‌, రాము, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

జాన్‌ స్నో ఇండియా కమిషనర్‌ డేవిడ్‌

Advertisement
 
Advertisement
Advertisement