సోషల్ మీడియా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్ల మాయలో పడకుండా ప్రజలే చైతన్యవంతులు కావాలి. సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తూ, అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్నారు. అందివచ్చిన మేరకు లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో సైబర్ మోసాలపై కొంతమంది శిక్షకులను ఏర్పాటు చేసి నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉండాలి. ప్రభుత్వాలు సైబర్ మోసాలను ఆదిలోనే అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు దాచుకున్న డబ్బులకు రక్షణ కరువైపోతుంది.
– పల్నాటి రాజేంద్ర, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్


