సైబర్‌ వల.. | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ వల..

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

సైబర్‌ వల.. – 8లోu జిల్లాలో 38 నెలల్లో 558 కేసులు

న్యూస్‌రీల్‌

సైబర్‌ నేరాల వివరాలు..

బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

రూ.3.66 కోట్లు కాజేసిన నేరగాళ్లు

కొత్త టెక్నాలజీల పేరుతో నిత్యం దోపిడీకి గురవుతున్న ప్రజలు

ములుగు: టెక్నాలజీ పెరుగుతోంది.. ప్రతీ పనికి ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్‌ ఫోనే అవసరమవుతోంది. ప్రభుత్వం కూడా పేపర్‌ లెస్‌ మనీ వాడాలని, ఆ విధంగా ప్రయత్నాలను వేగం చేస్తోంది. టీ బండి నుంచి పెద్ద పెద్ద లావాదేవీలు కూడా మన స్మార్ట్‌ ఫోనన్‌తోనే సాగుతున్నాయి. ఇదంతా అభివృద్ధి అనుకుంటూ ముందుగు సాగుతుంటే దీని మాటున ఎవరికీ తెలియని అంతులేని నేర సామ్రాజ్యం విస్తరిస్తుంది. పైసా పైసా కూడబెట్టుకున్న సామాన్యుల నుంచి, బడా వ్యాపారుల వరకు తెలియని సైబర్‌ నేర సామ్రాజ్యానికి నిత్యం బలైపోతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు నిత్యం అవగాహన కల్పించినా కొత్త, కొత్త టెక్నాలజీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను నిత్యం దొచుకుంటూనే ఉన్నారు. జిల్లాలో 2023 నుంచి సైబర్‌ నేరగాళ్లు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారనే విషయాన్ని యూత్‌ పర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగింది. ఈ క్రమంలో సమాచారాన్ని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అందించినట్లు సంస్థ పౌండర్‌ పల్నాటి రాజేంద్ర తెలిపారు.

సంవత్సరం కేసులు కాజేసిన రికవరీ

డబ్బులు డబ్బులు

2023 120 రూ.67.30 లక్షలు రూ.11,72,533

2024 194 రూ.1.53 కోట్లు రూ.18,10,748

2025 212 రూ.1.23 కోట్లు రూ.26,43,868

2026 32(ఫిబ్రవరి) రూ.20.49 లక్షలు రూ.5,76,737

Advertisement
 
Advertisement
Advertisement