● డీడీ దబ్బగట్ల జనార్దన్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లక్ష్యంతో చదివితే బంగారు భవిష్యత్ ఉంటుందని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల పరిధిలోని ఊరట్టం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పాఠశాల పీజీ హెచ్‌ఎం కల్తి శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽఽథులుగా డీడీ జనార్దన్, ఏటీడీఓ అజయ్‌కుమార్, ఏఎంఓ సుందర్‌రెడ్డి, సర్పంచ్ శైలజ హాజరై అంబేడ్కర్, సరస్వతిదేవి చిత్రపట్టాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతూ మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థినులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి, డిప్యూటీ వార్డెన్ రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


