క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఏటూరు గ్రామానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఖోఖో పోటీలు, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో నిర్వహించిన శ్రేష్ఠ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఏటూరు సర్పంచ్‌ కుర్సం రమాదేవి సన్మానించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖోఖోలో ప్రతిభ కనబర్చిన పుట్ట నేతాజీ, శ్రేష్ఠ పరీక్షలో ప్రతిభ కనబర్చిన మేకల హేమంత్‌ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, చిట్యాల రాజు, పూనెం రవి, రాజు, అంకుమల్లు, ముత్తేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement