రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

ఏటూరునాగారం: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్‌ దివాకర తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్‌ – అలైవ్‌’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ దివాకరతో పాటు ఏఎస్పీ మనన్‌భట్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడంతో కలిగే అనర్థాలతో కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. అనంతరం రోడ్డు భదత్ర అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే మండల కేంద్రంలోని ఆకులవారి గణపురం ప్రభుత్వ బాలి కల వసతి గృహాన్ని కలెక్టర్‌ సందర్శించి సౌకర్యాల పై ఆరా తీశారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌ లై ట్లు ఉండేలా చూడాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.

మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు

ములుగు రూరల్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు సూచనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement