వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

– 8లోu ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి

జిల్లాలో ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.

ఏటూరునాగారం : ప్రతి గ్రామ పంచాయతీలో రోజు వంద మంది కూలీలు పనులు చేయించే విధంగా ఈజీఎస్‌ సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ పీడీ చంద్రశేఖర్‌ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాలకు చెందిన ఈజీఎస్‌ ఏపీఓలు, టీఏలు, ఎఫ్‌ఏలు, మేట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీల హాజరు శాతం పెంచాలన్నారు. కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి హామీ కూలీలతో కలిగే లాభాలను వివరించాలన్నారు. వంద రోజుల పనులు పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలన్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామంలో జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడిని ఉపాధి హామీ పనులకు పంపించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డీఆర్‌డీఓ కృపాకర్‌, టీసీఎస్‌ వేణు, ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఈజీఎస్‌ ఏపీఓ చరణ్‌రాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement