వాజేడు: ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి గిరిజన కళా ఉత్సవానికి తరలివెళ్లారు. మండల పరిధిలోని పేరూరుకు చెందిన తొర్రెం వేణు మాధవరావు ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కళా ఉత్సవంలో తన చిత్రకళలతో ఆకట్టుకుని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన గిరిజన కళా ఉత్సవంలో పాల్గొని తన చిత్రకళల గురించి వివరించారు. దీంతో పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు.
పోస్టాఫీస్ ద్వారా
రాములవారి తలంబ్రాలు
భూపాలపల్లి అర్బన్: శ్రీ రామనవమి సందర్భంగా ఈనెల 27న భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సంబంధించిన పవిత్ర ‘కల్యాణ తలంబ్రాలు’ పోస్టాఫీస్ ద్వారా భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు సమీప పోస్టాఫీసులో రుసుం చెల్లించి తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చన్నారు. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలు (1 ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు) రూ.450, ముత్యాల తలంబ్రాలు (1 ముత్యం) రూ. 151 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు స్పీడ్ పోస్టు ద్వారా భక్తులకు పంపించనున్నట్లు తెలిపారు. శ్రీ రామనవమి మహోత్సవాలకు హాజరుకాలేని భక్తులకు ఈ సేవ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
ఎర్రగట్టు వెంకన్న కల్యాణం రద్దు
హసన్‌పర్తి: చంద్రగ్రహణంతో ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని రద్దు చేశారు. జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం హసన్‌పర్తి–భీమారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత స్వామి వారిని రథంపై ఎర్రగట్టుగుట్టకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటలలోపే స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆతర్వాత ఆయాన్ని ద్వారబంధనం చేశారు. చంద్రగ్రహణంతో ఈసారి స్వామివారి శోభాయాత్ర నిరాడంబరంగా సాగింది. బుధవారం మహా సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది.
కాక్లియర్ ఇంప్లాంట్‌తో
అంగవైకల్యం దూరం
ఎంజీఎం : కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చిన చెవుడు, మూగ అంగవైకల్యాన్ని పూర్తిగా నయం చేయొచ్చని ఎంజీఎం ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ శ్రమలత తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్‌లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్‌రావు, ఆడియాలజిస్ట్ డాక్టర్ రతన్‌సింగ్, డాక్టర్ జెన్నీఫర్, డాక్టర్ ప్రత్యూష, సీనియర్ రెసిడెంట్స్, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
గణపురం హోలీ సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో గణపేశ్వరుడిని మోదుగు పూలతో మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతీ సంవత్సరం హోలీ సందర్భంగా ఆలయ ఆవరణలో పూసే మోదుగు పోలతో స్వామి వారిని అలంకరిస్తామని ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు.


