బీమాతో ధీమా | - | Sakshi
Sakshi News home page

బీమాతో ధీమా

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

బీమాత

బీమాతో ధీమా

బీమాతో ధీమా ప్రమాదవశాత్తు మరణిస్తే రుణమాఫీ సంఘం సభ్యులకు బీమాతో భరోసా

స్వశక్తి సంఘాల

మహిళలకు మేలు

మహిళా సంఘం సభ్యురాలు అయి ఉండి సహజ మరణం చెందితే వారు తీసుకున్న రుణమాఫీ కానుంది. అదే సీ్త్ర నిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళ సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ. 10 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమ అవుతుంది. దీంతో పాటు రుణం మాఫీ చేస్తారు. 50 శాతం మించి అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం పరిశీలించి రూ. 5 లక్షలు అందించనున్నారు.

ములుగు రూరల్‌: మహిళలు ఆర్ధికాభివృద్ది సాధించడంతో పాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మహిళా సంఘాల సభ్యులకు భరోసా కల్పిస్తూ ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల బీమా పరిహారం పొందే విధంగా సౌలభ్యం కల్పించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు పొందిన రుణం సైతం మాఫీ చేయనుంది. దీంతో మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి అవకాశాలు

జిల్లాలో వివిధ సమాఖ్యల్లో 69,149వ మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు సీ్త్ర నిధి రుణాలతో పాటు బ్యాంకు రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ, పర్యాటక ప్రాంతాల్లో ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు ఉపాధి అవకాశాలు అందేలా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు.

బీమాకు అర్హులు వీరే..

గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు వారు స్వయం సహాయక సంఘాల సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తిస్తుంది.

ప్రభుత్వం మహిళా సంఘాల నుంచి రుణాలు అందించి ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. రుణం పొంది ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమాతో పాటు రుణమాఫీ చేస్తుంది. మహిళా సంఘాల సభ్యులకు సెర్ప్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. మహిళా సంఘాల సభ్యులకు భరోసాగా ఉంటుంది.

– శ్రీనివాస్‌, అదనపు డీఆర్‌డీఏ, ఐకేపీ

ప్రమాదవశాత్తు మరణిస్తే

రూ.10లక్షలు, రుణమాఫీ

జిల్లాలో 69,149 మందికి బీమా

బీమాతో ధీమా1
1/1

బీమాతో ధీమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement