చెక్‌డ్యాం నిర్మాణాలపై సర్వే చేయాలి | - | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యాం నిర్మాణాలపై సర్వే చేయాలి

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

చెక్‌

చెక్‌డ్యాం నిర్మాణాలపై సర్వే చేయాలి

చెక్‌డ్యాం నిర్మాణాలపై సర్వే చేయాలి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని జంపన్నవాగులో నీటి ప్రవాహం కొనసాగేలా చెక్‌డ్యాం నిర్మాణాలపై సర్వే నిర్వహించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరితహోటల్‌లో కలెక్టర్‌ టీఎస్‌.దివాకర, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌కేకన్‌లతో కలిసి గురువారం జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మేడారం మాస్టర్‌ ప్లాన్‌, జంపన్నవాగు అభివృద్ధి పనులు, వేసవి కాలంలో తాగునీటి సమస్యకు చర్యలు, 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం అదేశాల మేరకు మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గద్దెల చుట్టూ గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని, పూజారులతో సమావేశాలు నిర్వహించి వారి సూచన, సలహాల మేరకు పటిష్టమైన మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలన్నారు. మేడారం రోడ్ల డివైడర్‌ మధ్యలో ప్లాంటేషన్‌ చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని అధికారులను అదేశించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తదితర పనులపై సూచనలు చేశారు. అలాగే వచ్చే ఏడాదిలో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఘాట్ల వద్ద కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్‌ఈజీఎస్‌లో కూలీల సంఖ్య పెరిగే విధంగా చూడాలన్నారు. ఈసమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) మహేందర్‌జీ, అదనపు కలెక్టర్‌( స్థానిక సంస్థలు ) సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్‌, ఎండోమెంట్‌ కమిషనర్‌ సునిత, గ్రంథాలయ చైర్మన్‌ రవిచందర్‌, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను ప్రభుత్వం కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క చిత్రామిశ్రాను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్‌లపై ఉందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతుల వేదికలో నిర్వహించిన నూతన సర్పంచ్‌ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను తక్షణం పరిష్కరించే దిశగా పని చేయాలన్నారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యత

గోవిందరావుపేట: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వయో వృద్ధులకు భరోసా కల్పించడానికి 60ఏళ్లు నిండిన వారికి ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మండల పరిధిలోని పస్రాలో గురువారం మంత్రి సీతక్క పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా రూ.10 లక్షల నిధులతో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా గ్రామ సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాల ఉన్నతికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి జిల్లాకు దాదాపు 42 శాశ్వత భవనాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా వారికి రెట్టింపు ఆదాయం లభించిందని, మహిళలు స్వశక్తితో ఎదగడానికి వారికి సకాలంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి ఆర్థికాభివృద్ధికి పాటుపడడం జరుగుతుందని వివరించారు.

మేడారంలో అభివృద్ధి పనులకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధంచేయాలి

రాష్ట్ర పంచాయతీరాజ్‌,

గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క

చెక్‌డ్యాం నిర్మాణాలపై సర్వే చేయాలి1
1/1

చెక్‌డ్యాం నిర్మాణాలపై సర్వే చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement