ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు షురూ.. | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు షురూ..

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

ఇంటర్

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు షురూ..

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు షురూ..

ఏటూరునాగారం: జిల్లాలోని పది మండలాల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యారు. ఈ మేరకు ఆయా కళాశాలల సిబ్బంది విద్యార్థులను పరిశీలించి సెంటర్‌లోకి అనుమతించగా తెలుగు, సంస్కృతం, అరబిక్‌వంటి భాషా పరీక్షను ప్రశాంతంగా పరీక్ష రాసినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి నాయిని వీరేందర్‌ తెలిపారు. జిల్లాలోని పది కేంద్రాల్లో 1,832 మందిని అలాట్‌ చేయగా 1,787 మంది పరీక్షకు హాజరు కాగా 45 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే జాకారం, ములుగు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు తెలిపారు.

హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చిన అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతూ పరీక్షల కేంద్రాలకు చేరుకునే సమయంలో ఆలస్యమై పరీక్షలకు దూరమైన సందర్భాలున్నాయని వారు వాపోయారు. ఈ ఏడాది నుంచి 5 నిమిషాల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయగా..విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు షురూ..1
1/1

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement