ఐఏఎస్‌ల ఆకస్మిక బదిలీ
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్ కలెక్టర్‌గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి హోదా కల్పించన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా నియమించారు.
ఎవరు ఎక్కడికంటే..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్ హనుమకొండ కలెక్టర్‌గా నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మహబూబాబాద్‌కు బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ జోగులాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న సందీప్ కుమార్ ఝాను నియమించారు. మరో ఐఏఎస్ అధికారి, జనగామ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్‌ను బదిలీ చేస్తూ జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్ (ఎస్‌సీఎస్) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్‌కు వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి
ఏడుగురికి స్థానచలనం
హనుమకొండ కలెక్టర్‌గా చాహత్..
‘గ్రేటర్’కమిషనర్‌గా అదనపు బాధ్యతలు
మహబూబాబాద్‌కు హనుమకొండ
కలెక్టర్ స్నేహ శబరీష్
కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్
కలెక్టర్ అద్వైత్‌సింగ్
జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్
ఆయన స్థానంలో సందీప్
కుమార్ ఝా నియామకం
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ


