మేడారంలో మద్యం దందా!
మేడారం ( ములుగు/కాళేశ్వరం): మేడారం జాతరకు తరలివచ్చే భక్తుల అవసరాలను మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి నకిలీ మద్యాన్ని భారీ మొత్తంలో డంప్ చేసి దందా సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బుధ, గురువారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మద్యం రేట్లను అమాంతం పెంచారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల జేబులకు చిల్లుపెడుతున్నా సంబంధిత ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో చిన్నపాటి బెల్ట్‌షాపులపై దాడులు చేసి కేసులు పెట్టే అధికారులు మేడారం జాతరలో నకిలీ మద్యం దందా సాగిస్తున్న షాపులవైపు కన్నెత్తి చూడడం లేదు. మేడారం జాతర పేరుపై మద్యం వ్యాపారులు ఎకై ్సజ్ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అప్పజెప్పినట్లు విమర్శలు వస్తున్నాయి. జాతరలో కేఎఫ్ లైట్‌బీర్ రూ. 270 (అసలు ధర రూ.180), స్ట్రాంగ్ బీర్ రూ. 270(అసలు ధర రూ.190), బడ్‌వైజర్ రూ.300(అసలు ధర 200), రాయల్‌స్టాగ్ రూ. క్వార్టర్ 300(అసలు ధర 220), బ్లెండర్‌స్ప్రైడ్ రూ. 420 (అసలు ధర 360) ఇలా రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లైసెన్స్‌లు నామమాత్రంగా తీసుకొని వందల సంఖ్యలో మద్యం దుకాణాలు వెలియడంతో భక్తులు ఽఅధిక ధరలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై భూపాలపల్లి ఎ కై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
ధరలు పెంచి విక్రయిస్తున్న వ్యాపారులు
ఇతర రాష్ట్రాల నుంచి
నకిలీ మద్యం డంప్


