విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
మేడారం(ములుగు/హన్మకొండ): మేడారం జాతరలో విద్యుత్ ప్రమాదాల నివారణకు లైన్లకు స్పేసర్ అమర్చినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, టి.మధుసూదన్ తెలిపారు. గురువారం మేడారంలో వారు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించి మాట్లాడారు. చీఫ్ ఇంజనీర్లు కె.రాజుచౌహాన్, అశోక్ పర్యవేక్షణలో నలుగురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఏడుగురు డివిజన్ ఇంజనీర్లు, 30 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు 150, 500 మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. భద్రతలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. శాశ్వత ప్రాతిపదికన జంపన్న వాగు ఇరువైపులా 6 టవర్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సిబ్బంది లోడ్ తనిఖీ చేస్తున్నారని, ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వెంటనే సమాచారం కంట్రోల్ రూంకు చేరవేస్తుందని పేర్కొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు
వి.మోహన్‌రావు, టి.మధుసూదన్


