అమ్మవార్లకు మొక్కలు
గోవిందరాజులు..
ములుగు: మేడారం సమ్మక్క– సారలమ్మ దేవతలను భక్తులు క్యూలైన్లలో వెళ్లి దర్శించుకుంటున్నారు. మహాజాతర సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం మూడు వైపులా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. గద్దెలను విస్తరించిన క్రమంలో ఈసారి మేడారంలో తక్కువ సమయంలో వనదేవతల దర్శనం జరుగుతోందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఎక్క డా తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి క్యూలైన్ల వద్ద భక్తులకు తాగునీటి వసతి కల్పించారు. క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన క్యూలైన్లపై పోలీసులు, వలంటీర్ల నిరంతరం మార్గనిర్దేశం చేయడంతో వనదేవతల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. గత జాతరలతో పోలిస్తే ఈ సారి అమ్మవార్లను దర్శించుకోవడం కొంచెం సులభంగా మారింది.


