రామప్పలో భక్తుల రద్దీ
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. మేడారాన్ని సందర్శించిన అనంతరం భక్తులు రామప్పకు చేరుకుని రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలను చాటుకుంటున్నారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని అమెరికాకు చెందిన విదేశీయులు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
రామప్ప ఆలయంలో
మేడారం భక్తుల సందడి
రామప్పలో భక్తుల రద్దీ


