మేడారానికి యాపలగడ్డ పగిడిద్దరాజు
ఎస్‌ఎస్ తాడ్వాయి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలోని యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజు మేడారానికి సోమవారం పయనమయ్యారు. అరెం వంశస్తులు యాపలగడ్డలోని పగిడిద్దరాజు గద్దె వద్ద సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మేడారానికి కాలినడకన కదిలారు. ఈ నెల 28న (బుధవారం) కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దె పైకి రానున్న సందర్భంగా యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజును మేడారానికి తీసుకురానున్నారు. మేడారం జాతర చైర్ పర్సన్ ఇర్ప సుకన్యసునీల్, మాజీ కమిటీ చైర్మన్ అరెం లచ్చుపటేల్, సమ్మక్క పూజారి స్వామిలు యాపలగడ్డకు వెళ్లి పగిడిద్దరాజుకు స్వాగతం పలికారు.


