గట్టమ్మ ఆలయానికి భక్తుల తాకిడి
ములుగు రూరల్: మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో బయలుదేరారు. ఈ మేరకు సోమవారం రాత్రి సమయంలో ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో భక్తులు అధిక సంఖ్యలో గట్టమ్మ ఆలయానికి చేరుకొని పుసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ఆలయాల్లోని పరిసరాల్లో ఉన్న సమ్మక్క–సారల మ్మ తల్లుల గద్దెలను దర్శించుకున్నారు. అలాగే సోమవారం రాత్రి గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాల రద్దీ పెరిగింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సీఐ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


