ఆదివాసీ యువత రోప్‌పార్టీ సిద్ధం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో ఆదివాసీ యువతతో రోప్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని మేడారం గద్దైపెకి తీసుకొచ్చే క్రమంలో పోలీసుల రోప్ పార్టీతో పాటు మేడారానికి చెందిన ఆదివాసీ యువతతో రోప్ పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో పోలీసుల రోప్ పార్టీ కీలకమైనప్పటికీ ఆదివాసీ యువత రోప్ పార్టీ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. సమ్మక్కతల్లి చిలకలగుట్ట దిగిన నుంచి గద్దైపెకి ప్రతిష్టించే వరకు ఆదివాసీ యువత సంప్రదాయాలను పాటిస్తూ రోప్ పార్టీగా అమ్మవారిని గద్దైపెకి తీసుకొస్తుంది. యువతకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. సోమవారం చిలకలగుట్ట వద్ద ఆదివాసీ యూత్ రోప్ పార్టీ సమావేశమై అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించారు. ఈ సందర్భంగా చిలకల గుట్ట వద్ద ట్రాక్టర్ డోజర్‌తో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.


