గట్టమ్మతల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ
ములుగు రూరల్: మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు గట్టమ్మతల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం ఆదిదేవత గట్టమ్మతల్లిని సీతక్క దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం గట్టమ్మ ఆలయ ప్రాంగణంలో జిప్సి గోల్డ్ వారి సహకారంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు గట్టమ్మ వద్ద పార్కింగ్, టాయిలెట్స్, పుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించామని తెలిపారు. గట్టమ్మ వద్ద మిని మేడారం జాతరను తలిపిస్తుందని వెల్లడించారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించిన జిప్సి గోల్డ్ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాహకులు పింగిళి నాగరాజు, గంగిశెట్టి శ్రీనివాస్, తిరుమల రవిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, దేవాదాయశాఖ ఈఓ ప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, గొల్లపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు మెరుగైన వైద్యసేవలు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మహాజాతరకు వచ్చే భక్తులకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున సురక్షితమైన ఆరోగ్య సేవలు అందుతాయని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో సోమవారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మంత్రి సీతక్క ప్రారంభించి మాట్లాడారు. జాతరకు వచ్చి అనారోగ్య సమస్యల బారిన పడిన భక్తులు వైద్యశిబిరాల్లో ఆరోగ్య సేవలు పొందాలని సూచించారు. అనంతరం మేడారం తుడుందెబ్బ వలంటీర్లకు జాతర సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేసిన టీ షర్టులను మంత్రి సీతక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఐటీడీఓ పీఓ చిత్రామిశ్రా, ఏఎంసీ చైర్‌పర్సన్ కల్యాణి, వైద్యాధికారులు, వైద్యులు, తుడుందెబ్బ నాయకలు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి సీతక్క
గట్టమ్మతల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ


