
ముంపు ప్రాంతాల పరిశీలన
ములుగు రూరల్/ఎస్‌ఎస్‌తాడ్వాయి: తాడ్వాయి మండల పరిధిలోని పడిగాపూర్ జంపన్నవాగు లోలెవల్ కాజ్ వే, నార్లాపూర్ కాజ్‌వే, ఊరట్టం వరద ముంపు ప్రాంతాలను మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్, డీపీఓ దేవరాజు, తహసీల్దార్ సురేష్‌బాబు పరిశీలించారు. అలాగే మేడారం జంపన్నవాగును వరదను పరి శీలించి జంపన్నవాగు వద్ద అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అదే విధంగా జలగలంచ వాగు, ఎల్బాక జంపన్నవాగు, లోలేవల్ కాజ్ వే వరద, మేడారం జంపన్నవాగు వరదలను పార్టీ నాయకులతో కలిసి డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పరిశీలించారు.జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద కొబ్బరికాయ కొట్టి వరదలో పసుపు, కుంకుమ వదిలి వరద శాంతించాలని పూజాలు చేశా రు. నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. డీఎస్పీ రవీందర్ జంపన్నవాగు వరద ఉధృతితో పాటు మేడివాగు, రాళ్లవాగు వరద ఉధృతిని పరిశీలించారు. బండారుపల్లి ప్రాంతంలో రాళ్లవాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. సర్వాపూర్–జగ్గన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న బొగ్గుల వాగు లోలెవెల్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి.