
పొంచి ఉన్న ప్రమాదం
● రోడ్డు వెంట ఎండిపోయి శిథిలావస్థకు చేరుకున్న భారీ వృక్షాలు
గోవిందరావుపేట: నిత్యం పర్యాటకులు, గ్రామస్తుల రాకపోకలతో రద్దీగా ఉండే బుస్సాపూర్– లక్నవరం రోడ్డు పై ఎండిపోయి ఉన్న భారీ వృక్షాలతో ప్రమాదం పొంచి ఉంది. కల్వరి, జాతీయత, రామవరం లాంటి వృక్షాలు పూర్తిగా ఎండిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎండిపోయిన చెట్ల కొమ్మలు రోడ్డు పై పడి ప్రమాదాలు తప్పిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అటవీ శాఖ, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులు ఎండిన చెట్లను తొలగించాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.