
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
వెంకటాపురం(ఎం): ఆయిల్‌పామ్ పంటల సాగుతో రైతులు తక్కువ పెట్టుబడి అధిక లాభాలు పొందవచ్చని, ఆయిల్‌పామ్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్.దివాకర సంబంధిత అధికారులకు సూచించారు. మండల పరిధిలోని జవహర్‌నగర్‌లోని కేఎన్ బయోసైన్స్ ఆయిల్‌పామ్ నర్సరీని కలెక్టర్ బుధవారం సందర్శించారు. నర్సరీ విస్తీర్ణం.. మొక్కల పెంపకం.. నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కలు తదితర వివరాలను జిల్లా ఉద్యాన అధికారి సంజీవరావును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది రైతులకు నర్సరీలో ఒక సంవత్సరం వయస్సు గల మొక్కలను పెంచి ఇవ్వగా, ఇంకా 1.17 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒక మొక్క 1.2 మీటర్ ఎత్తులో, 12 ఆకులతో నాణ్యత కలిగిన మొక్కలు అందుబాటులో ఉన్నాయని సంజీవరావు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆయిల్‌పామ్ పంట సాగుపై అవగాహన కల్పించి ఎక్కువ ఎకరాల్లో మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ నిబంధనల మేరకు నాణ్యమైన మొక్కలను రైతులకు సకాలంలో అందించాలన్నారు. నర్సరీ, కంపెనీ నిర్వాహకులకు కలెక్టర్ దివాకర పలు సూచనలు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సరీ ఇన్‌చార్జ్ ఉద్యాన అధికారి జే.శ్రీకాంత్, నర్సరీ నిర్వాహకుడు కర్ణాకర్, ములుగు, వెంకటాపూర్ ఆయిల్‌పామ్ కంపెనీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నవీన్ నాయక్, జైన్ డ్రిప్ కంపెనీ ప్రతినిధి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మేడారంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. మలేరియా, డెంగీ వ్యాధులను నియంత్రించాలన్నారు, ఫీవర్ సర్వే చేపట్టాలని సూచించారు. ఇంటింటినీ సందర్శించి నిల్వ నీటిలోని దోమల లార్వాను తొలగించాలని సూచించారు. ప్రతీ జ్వర పీడితుడికి మలేరియా, డెంగీ ఆర్డిటీ రక్త పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శిబిరంలో వైద్యసేవలు పొందిన వారి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సిబ్బందికి వివరించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర

ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు