
ఉద్యోగ విరమణ సహజం
ములుగు రూరల్: ఉద్యోగులందరికీ ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ శబరీశ్ అన్నారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ఆర్‌ఎస్సై సంపత్‌రావును ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌రావుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏఆర్‌హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్న సంపత్‌రావు డినార్ట్‌మెంట్‌లో సుదీర్ఘ సేవలను అందించారని తెలిపారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలు అమోఘమన్నారు. పదవీ విరమణ చేసిన పోలీస్ కుటుంబాల్లో ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, ఆర్‌ఐలు స్వామి, తిరుపతి, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్
పోస్టర్ ఆవిష్కరణ
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఓ ఆఫీస్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్, డీఆర్‌డీఓ ప్రాజెక్టు ఆఫీసర్ సంపత్‌రావు గురువారం ఓపెన్ స్కూల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ డీఆర్‌డీఓ శ్రీనివాస్, అడల్ట్ ఎడ్యూకేషన్ ఏబీఎస్ వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం తదితరులు పాల్గొన్నారు.
పట్టుపరిశ్రమ
భూముల పరిశీలన
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎక్కెల ప్రాంతంలోని పట్టుపరిశ్రమ శాఖకు కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ క్రమంలో ఆర్‌ఐ చిక్కుల కిరణ్‌కుమార్‌తో పాటు సిబ్బంది వెళ్లి పరిశీలించగా కొంతమంది ఆ భూములు తమవని, సాగులో ఉన్నామని వాగ్వాదానికి దిగారు. అయితే ప్రభుత్వానికి చెందిన భూములు ఎవరి ఆధీనంలో ఉన్నా ప్రభుత్వం చట్ట పరమైన తీసుకుంటుందని తెలిపారు. విధులకు ఆటంకం కలిగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని వెల్లడించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని వాగ్వాదం చేసే వారిని శాంతింపజేశారు.
సిబ్బంది అప్రమత్తంగా
ఉండాలి
ఏటూరునాగారం: మావోయిస్టు ఏరియా ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఏఎస్పీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు చేశారు. ప్రజలకు మర్యాదపూర్వకంగా సమస్యలను పరిష్కరిస్తూ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్ ఇంప్లిమెంటేషన్, వర్టికల్స్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పిటిషన్ మేనేజ్‌మెంట్, పోలీస్‌స్టేషన్ పనితీరును రిసెప్షన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలని, డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలను నియంత్రించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై, రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. క్రైమ్ వాహనాలు, ఇతర వాహనాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ సహజం

ఉద్యోగ విరమణ సహజం