
విద్యారంగం బలోపేతానికి చర్యలు
ములుగు రూరల్: విద్యారంగాన్ని బలోపేతం చేసేందకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల క్లాస్‌రూమ్‌లను పరి శీలించారు. పదో తరగతి విద్యార్థులతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సబ్జెక్ట్‌ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలని విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రభుత్వం అమ్మ అదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రణాళికతో చదవుకుని ఉన్నతస్థాయికి చేరుకోవా లని సూచించారు. పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
గోవిందరావుపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జ్వరంతో వచ్చే ప్రతీవ్యక్తికి మలేరియా, డెంగీ రక్త పరీక్షలను నిర్వహించి మెరుగైన వైద్యాన్ని అందించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ రూంలో మలేరియా, డెంగీ ఆర్డీటీ పరీక్షలకు సరిపడా టెస్ట్ పరికరాలు ఉన్నాయా అని అడిగి తెలుపుకున్నారు. లేకుంటే వెంటనే సమకూర్చుకోవాలని ల్యాబ్ టెక్నీషియన్‌కి తెలిపారు. అనంతరం మందుల నిల్వల గదిని చూసి వర్షాకాలానికి సరిపడే మందులు అందుబాటులో ఉంచుకోవాలని, వాటితో పాటు అత్యవసర మందులైన పాము, కుక్క కాటుకు వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోవాలని ఫార్మసిస్టుకు సూచించారు. ఈ కార్యక్రమంలో పస్రా వైద్యాధికారి సుహానా, ఫార్మసిస్ట్ శారద, స్టాఫ్ నర్సులు సంధ్య, రమాదేవి, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర

విద్యారంగం బలోపేతానికి చర్యలు