
పట్టాదారుల వివరాలు పరిశీలించాలి
ములుగు రూరల్: పట్టాదారుల వివరాలను పారదర్శకంగా పరిశీలించాలని రాష్ట్ర సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీలు పాల్గొన్నారు. భూమి రీ సర్వే నంబర్లకు సర్వే సిబ్బందిని పంపించి సర్వే పూర్తి చేసి పట్టాదారుల వివరాలను, పహానీలో క్షుణ్ణంగా పరిశీలించి రెండు రోజుల్లో రిపోర్టు అందించాలని సూచించారు. ఈ విషయంపై కలెక్టర్ దివాకర సిబ్బందితో మాట్లాడుతూ రెవెన్యూ సర్వే సిబ్బంది ఫీల్డ్‌కు వెళ్లి విచారణ చేపట్టి రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులు పారదర్శకంగా చట్టానికి లోబడి వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్