
తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు
ములుగు రూరల్: ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో తాత్కాలిక బస్టాండ్‌ను డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రవిచందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్ నిర్మాణానికి మంత్రి సీతక్క రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. బస్టాండ్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బస్టాండ్‌లోకి బస్సుల రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.