
క్లోరినేషన్, బ్లీచింగ్ పనులు తప్పనిసరి
వెంకటాపురం(కె): మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్లోరినేషన్, బ్లీచింగ్ పనులు తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో బుధవారం, శుక్రవారం డ్త్రెడే తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు స్వయం సహాయక సంఘం సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత లేని ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు, రోడ్లు, డ్త్రెనేజీలు పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో జీపీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు తరలించి వర్మి కంపోస్టు తయారు చేయాలని సూచించారు. ప్రతీ వాటర్ ట్యాంక్‌ను వారానికి ఒక్కసారి బ్లీచింగ్‌తో శుభ్రం చేయించి వెయ్యి లీటర్లకు 100 గ్రాముల బ్లీచింగ్ కలపాలన్నారు. నిల్వ నీటిలో ఆయిల్‌బాల్స్ వేయాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు రాకుండా పైపులైన్ లీకేజీలను మరమ్మతులు చేయించాలని వివరించారు. పంచాయతీల్లో వారం రోజుల పాటు చేయాల్సిన పనుల ప్రణాళికలను రూపొందించారు.
మినీగురుకులంలో తనిఖీ
వాజేడు: మండల కేంద్రంలోని జంగాలపల్లిలోని బాలికల మినీ గురుకులాన్ని డీపీఓ దేవరాజు ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడుతో కలిసి తనిఖీ చేశారు. మినీ గురుకులం పరిసరాలు, వంట గది, కూరగాయల గదిని పరిశీలించారు.
ఎన్నికల పనులు పూర్తిచేయాలి
ఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుందని, పంచాయతీ కార్యదర్శులు ఎన్నికలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవాలని డీపీఓ దేవరాజ్ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలింగ్ బూత్‌లు, ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. దోమల నివారణకు మందులు పిచికారీ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్