
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం: రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని స్పెషల్ అఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి, ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శించారు. జ్వరంతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతర కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ సీజనల్‌వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో దోమల నియంత్రణకు యాంటీ లార్వా స్ప్రే చేయాలని, నీటినిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్య వ్యాధులను నియంత్రించాలని సూచించారు. ఆశా వర్కర్లు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఉపకేంద్రాల్లో మానిటరింగ్ సూపర్వైజర్లను నియమించి వ్యాధుల నియంత్రణకు ప్రణాళికు రూపొందించినట్లు తెలిపారు. ఏటూరునాగారంలో ఐసీటీసీ సెంటర్‌ను సందర్శించి ఎయిడ్స్, హెచ్‌ఐవీ టెస్టుల విషయాన్ని తెలుసుకున్నారు. షాపెల్లి గ్రామంలని సబ్ సెంటర్‌ను వెంకటేశ్వరెడ్డి తనిఖీ చేశారు. డెంగీ జ్వరంతో బాధపుతున్న బాలుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి పిల్లల ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు, డీపీఓ దేవరాజ, డీసీహెచ్ ములుగు వైద్యాధికారి జగదీశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఏటూరునాగారం ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్, జిల్లా పోగ్రామ్ ఆఫీసర్ పవన్‌కుమార్, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్ రావు, వెంకటరెడ్డి, సాంబయ్య, నర్సింహరావు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
అవగాహన కల్పించాలి
వాసం వెంకటేశ్వరెడ్డి

మెరుగైన వైద్యసేవలు అందించాలి