విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి

Aug 2 2025 6:48 AM | Updated on Aug 2 2025 6:48 AM

విద్య

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి

ములుగు రూరల్‌: గురుకుల పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ అన్నారు. మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు మెనూ ప్ర కారం పౌష్టికాహారం అందించాలని అన్నారు. సీజ నల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్ర పాటించాలని సూచించారు. ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లో విద్యార్థినులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీలత పాల్గొన్నారు.

నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలి

లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ దివాకర అన్నారు. జగ్గన్నపేట, అన్నంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణా లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇంటి నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సమష్టి కృషితోనే సంపూర్ణ అభివృద్ధి

కన్నాయిగూడెం: ప్రభుత్వ అధికారులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ టీఎస్‌ దివాకర అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆకాంక్షా బ్లాక్‌, సంపూర్ణ అభియాన్‌ కా ర్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న 500 ఆకాంక్షా బ్లాక్‌లలో కన్నాయిగూడెం ఆస్పేరేషనల్‌ బ్లాక్‌ ఒకటన్నారు. పథకాలు ప్రజలకు చేరడంలో, సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ముందుండాలన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, విద్య, వ్యవసా యం, ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో కృషి చేసిన జిల్లా బ్లాక్‌స్థాయి అధికారులను ప్రశంసించారు.

ఆకాంక్ష హట్‌ ప్రారంభం

స్వయం సహాయక బృందాలు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులు, చేతి వృత్తుల వస్తువులకు వేదిక కల్పించడమే ఆకాంక్షా హట్‌ లక్ష్యమని కలెక్టర్‌ అన్నారు. మహిళలు తయారు చేసిన వస్తులవులను మార్కెటింగ్‌ చేసేందుకు హట్‌ వేదిక అవుతుందన్నారు. ఏపీడీ వెంకటనారాయణ, తుల రవి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సాజిదా, రవీష్‌ పాల్గొన్నారు.

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి1
1/1

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement