కోడి‘గుడ్‌’..విధానం! | - | Sakshi
Sakshi News home page

కోడి‘గుడ్‌’..విధానం!

Aug 2 2025 6:48 AM | Updated on Aug 2 2025 6:48 AM

కోడి‘గుడ్‌’..విధానం!

కోడి‘గుడ్‌’..విధానం!

సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ‘ఆన్‌లైన్‌’ ప్రక్రియ

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి 2025–26 సంవత్సరానికిగాను టెండర్‌ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్‌ల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్‌ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్‌ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్‌ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా గతనెల 23 నుంచి ఆన్‌లైన్‌ టెండర్‌లు ఆహ్వానించారు. ఈ మేరకు ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్‌ షెడ్యూల్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. అంతకు ముందు ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్‌లతో కలెక్టర్‌లు ఫ్రీ బిడ్‌ సమావేశాలు కూడా నిర్వహించారు.

ఒక్కో జిల్లాలో ఒక్కో రేటు...

హనుమకొండ, వరంగల్‌లో తక్కువ..

ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధికారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కొడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్‌ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్‌, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్‌లు ఈ టెండర్‌లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్‌ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్‌లైన్‌ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్‌లు సిండికేట్‌ కడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే..

వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్‌ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీ ఆగ్మార్క్‌ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులై న కాంట్రాక్టర్‌లను ఎంపిక చేసేది. ఆ తర్వాత కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరిమా ణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్‌లో పేర్కొ న్న విధంగా కాకుండ తక్కువ గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారా ఆన్‌లైన్‌ టెండర్‌లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్‌లు బిడ్‌ డాక్యుమెంట్లను టౌన్‌లోడ్‌ చేసుకుని ఆన్‌లైన్‌లో బిడ్‌లను సమర్పించాలని నోటిఫికేషన్‌లో సూచించారు. సమర్పించిన బిడ్‌ల హార్డ్‌ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్‌/షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటా యించిన విధంగా టెక్నికల్‌ బిడ్‌లు, ధరల బిడ్‌లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు.

విద్యాలయాల్లో

7.33 కోట్ల కోడిగుడ్లకు..

సుమారు రూ.40.60 కోట్లు

ఉమ్మడి వరంగల్‌లో

ఐదు జిల్లాలకే టెండర్లు..

భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ

ఈ నెల 6 నుంచి 12 వరకు

షెడ్యూల్‌ దాఖలు..

12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్‌

అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలు

అందుకే పాలసీ మార్చిన ప్రభుత్వం..

జిల్లా సరఫరా కేటాయించిన

చేయాల్సిన డబ్బులు (రూ.లలో)

కోడిగుడ్లు

హనుమకొండ 1,31,14,397 6,71,45,713

వరంగల్‌ 1,40,76,730 7,89,70,455

మహబూబాబాద్‌ 1,77,87,502 10,01,43,636

జనగామ 1,26,05,592 7,09,69,483

ములుగు 78,11,600 4,39,79,308

భూపాలపల్లి 79,54,004 4,47,81,042

మొత్తం 7,33,49,825 40,59,89,637

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement