
రెండు నెలలు ఇంటింటి సర్వే
● డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్
వాజేడు: రెండు నెలల పాటు వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేయాలని ఏటూరునాగారం ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కోరం క్రాంతికుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్యశాలలోని ఫార్మసీ ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డు పరిశీలించి సీజనల్ వ్యాధులు, రోజు వారి ఓపీపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ లు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యులు ఇంటింటి సర్వే తప్పకుండా చేయాలన్నారు. ఆయన వెంట వాజేడు వైద్యాధికారి మహేందర్, కోటిరెడ్డి, రఘు, రజనీకాంత్ ఉన్నారు.