Vyavastha: జీ5లో దూసుకుపోతున్న వ్యవస్థ..

ZEE5 Series Vyavastha Clocks 150 Million Viewing Streaming Minutes - Sakshi

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో విజయవంతంగా దూసుకుపోతున్న వెబ్‌ సిరీస్‌ ‘వ్యవస్థ’. ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు. ఈ సిరీస్‌ 150 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌స్థ టీమ్ స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వ్యవస్థలో వర్క్ చేసిన వారందరూ చాలా కావాల్సిన వారే. సంపత్‌గారితో క‌లిసి సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మ‌లానీతో నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంది. హెబ్బా ప‌టేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ ర‌త్నం అంటే చాలా ఇష్టం. త‌ను వ్య‌వ‌స్థ‌లో పోషించిన తీరు అద్భుతం. ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగ‌గారితో డీకే బోస్ చిత్రం నుంచి ప‌రిచ‌యం ఉంది. వ్య‌వ‌స్థ సినిమాను ఎలా తెర‌కెక్కించారా? అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు సందీప్‌ కిషన్‌.

కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘సందీప్ కిషనన్న‌ను క‌లిసిన త‌ర్వాత ఆయ‌న నాకు ఎప్పుడూ తిరుగులేని స‌పోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగ‌గారితో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. ప‌ట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంప‌త్ రాజ్‌, అనిల్ సార్ అంద‌రికీ థాంక్స్‌. హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా ఆనందంగా ఉంది. జీ 5వారు చేస్తోన్న స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం’’ అన్నారు.

కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ ‘‘ఎగ్జ‌యిటెడ్‌గా, నెర్వ‌స్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాను. చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండ‌టంతో యాక్సెప్ట్ చేశాను’’ అన్నారు. సంప‌త్ రాజ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో నాకీ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ రంగాగారికి థాంక్స్‌. వ్య‌వ‌స్థ చేసే ముందు చాలా మంది ఎందుకు చేస్తున్నావ‌ని అడిగారు. అయితే నాకు స్క్రిప్ట్‌పై నమ్మ‌కం ఉంద‌ని చెప్పాను. ఇదొక స్లో బ‌ర్న‌ర్‌లా ఆడియెన్స్‌కి క‌నెక్ట్ అయ్యింది. కంటెంట్ బావుంటే ఆడియెన్స్ ఆద‌రిస్తార‌ని మ‌రోసారి వ్య‌వ‌స్థ ప్రూవ్ చేసింది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top