కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేసిన ప్రముఖ యూట్యూబర్! | Sakshi
Sakshi News home page

Youtuber cum Comedian: రూ.11 కోట్ల విలువైన బంగ్లా కొన్న కమెడియన్!

Published Fri, Jan 12 2024 1:06 PM

Youtuber Buys 11 Crore Bungalow In South Delhi Goes Viral - Sakshi

ప్రముఖ యూట్యూబర్‌ కమ్ కమెడియన్ భువన్ బామ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. గుజరాత్‌కు చెందిన భువన్ దేశ రాజధాని ఢిల్లీలో విలాసవంతమైన బంగ్లాను తీసుకున్నారు. యూట్యూబ్‌లో తన వీడియోలతో  ఓవర్‌నైట్‌ స్టార్‌గా దాదాపు రూ. 11 కోట్లకు బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో బంగ్లాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీబీ కి వైన్స్ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. 

వడోదరకు చెందిన భువన్ బామ్ యూట్యూబ్‌లో వీడియోల ద్వారానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించగా.. 26.4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ కలిగి ఉన్నారు. అతని కంటెంట్ ప్రధానంగా హాస్య భరితమైన పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం, స్నేహితులతో కలిసి కామెడీ కంటెంట్‌ను రూపొందిస్తుంటారు. అంతే కాకుండా భువన్‌ సంగీతంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే చాలా సాంగ్స్‌ కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా దిండోరా, రాఫ్తా రాఫ్తా, తాజా ఖబర్ వంటి వెబ్  సిరీస్‌లలో కూడా నటించాడు. ఇటీవలే ప్రసిద్ధ జపనీస్ గేమ్ షో తకేషిస్ కాజిల్‌కు కామెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వార్తలపై భువన్ ఇంకా స్పందించలేదు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement