Hansika Motwani : హన్సిక పెళ్లాడబోతున్న వ్యాపారవేత్తకు ఇదివరకే పెళ్లయిందా?

Who Is Hansika Motwani Fiance Shoail Kathuria Things To Know About Him - Sakshi

దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్‌ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్‌ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో అసలు హన్సిక పెళ్లి చేసుకోబోయేది ఎవరు?

అతను ఏం చేస్తుంటాడన్నది తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్‌కు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోహెల్‌ ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. బిజినెస్‌లోఊ ఇద్దరూ పార్ట్‌నర్స్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోహెల్‌కు ఇది రెండో పెళ్లి. 2016లో రింకీ అనే అమ్మాయితో ఇదివరకే అతనికి పెళ్లయిందట. అయితే తర్వాత విభేదాల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు.
 

మరో విశేషం ఏంటంటే.. రింకీ హన్సికకు బెస్ట్‌ఫ్రెండ్‌ అట. రింకీ పెళ్లి వేడకలోనూ హన్సిక పాల్గొంది. దీనికి సంబంధించన ఓల్డ్‌ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.ఇప్పుడు ఆ బెస్ట్‌ఫ్రెండ్‌ మాజీ భర్తనే హన్సిక పెళ్లాడబోతుంది. డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా హన్సిక-సోహెల్‌ పెళ్లి వేడకకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top