"వీకెండ్ పార్టీ" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌ | Weekend Party First Look Poster Released | Sakshi
Sakshi News home page

Weekend Party: 'అడ్డదారులు' రచన ఆధారంగా వీకెండ్‌ పార్టీ

Feb 17 2022 3:32 PM | Updated on Feb 17 2022 3:32 PM

Weekend Party First Look Poster Released - Sakshi

1990వ దశకంలో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని అమరుడు బోయ జంగయ్య రాసిన "అడ్డదారులు" రచనను తీసుకుని 'వీకెండ్ పార్టీ" తెరకెక్కించారు. నలుగురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతో ఒక వీకెండ్ సాగర్‌కు వెళ్లగా అక్కడ ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కొన్నారనేది సినిమా కథ.

బి.జె క్రియేషన్స్, ఫోర్త్ ఆల్ థియేటర్ సంస్థలు సంయుక్తంగా బోయ చేతన్ బాబు నిర్మాణ సారథ్యంలో అమరేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం "వీకెండ్ పార్టీ". పాశం నరసింహారెడ్డి, పాశం కిరణ్ రెడ్డి, ఎన్ రేఖ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 1990వ దశకంలో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని అమరుడు బోయ జంగయ్య రాసిన "అడ్డదారులు" రచనను తీసుకుని 'వీకెండ్ పార్టీ" తెరకెక్కించారు. సదా చంద్ర సంగీతం సమకూర్చిన ఈ సినిమా కు చంద్ర బోస్, కాసర్ల శ్యామ్, సదా చంద్రలు సాహిత్యం సమకూర్చారు. అద్దంకి రాము సినిమాటోగ్రఫీ అందించగా సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రాఫర్‌గా చేశారు.

 వేముల వెంకట్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నలుగురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతో ఒక వీకెండ్ సాగర్‌కు వెళ్లగా అక్కడ ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కొన్నారనేది సినిమా కథ. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి వీకెండ్‌ పార్టీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. వీకెండ్ పార్టీ కథ అద్భుతంగా ఉంది. దర్శకుడు మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినందుకు ఎంతో గొప్పగా ఉంది. అన్నారు.

దర్శకుడు డైరెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై, నాపై నమ్మకం పెట్టుకుని తెరకెక్కించిన నిర్మాతకు ధన్యవాదాలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో మంచి నటీనటులు నటించారు. తప్పకుండా అందరిని మెప్పిస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.. అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement