విశ్వంభర డేట్‌ ఫిక్స్‌  Vishwambhara Release On January 2025 | Sakshi
Sakshi News home page

విశ్వంభర డేట్‌ ఫిక్స్‌

Published Sat, Feb 3 2024 3:22 AM

Vishwambhara Release On January 2025 - Sakshi

సంక్రాంతి రిలీజ్‌ డేట్‌ను కన్ఫార్మ్‌ చేసుకున్నాడు ‘విశ్వంభర’. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. గత ఏడాది నవంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

తొలుత చిరంజీవి పాత్రకు సంబంధించని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘విశ్వంభర’ సినిమా సెట్స్‌లో ఈ శుక్రవారం చిరంజీవి జాయిన్‌ అయినట్లుగా చిత్ర యూనిట్‌ పేర్కొని, ఈ సినిమాను జనవరి 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హైదరబాద్‌లో వేసిన ఓ సెట్‌లో ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగు తోందని కూడా చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement