మార్చిలో గోదావరి గ్యాంగ్‌ 

Vishwak Sen Gangs Of Godavari Movie Release Date Announced - Sakshi

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించగా, నటి అంజలి ముఖ్యమైనపాత్రను పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్‌ ఉప్పుటూరి, ఇన్మమూరి గోపీచంద్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీ మారింది.

తొలుత డిసెంబరు 8న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే 2024 మార్చి 8న రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. అతని ప్రయాణంలో రాజకీయ చిక్కులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ గ్రే క్యారెక్టర్‌లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, కెమెరా: అనిత్‌ మధాడి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top