ఎన్టీఆర్‌ హీరోయిన్‌ బైక్‌ రైడ్‌.. వీడియో వైరల్‌

Viral Video: Mamta Mohandas Rides Bike After 15 Years - Sakshi

దర్శకుడు ధీరుడు రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలయికలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘యమదొంగ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మలయాళ నటి మమతా మోహన్‌ దాస్‌.  ఆ సినిమాలో ఒక స్పెషల్ గ్లామరస్ పాత్రలో కనిపిస్తూనే ఎన్టీఆర్ కు గట్టి పోటీని ఇచ్చింది. ఆమె నటనను చూసి దర్శకుడు రాజమౌళి అప్పట్లో షూటింగ్ స్పాట్ లోనే షాక్ అయ్యేవారట. కెరీర్‌ మొదట్లోనే క్యాన్సర్‌ని జయించిన ఈ మలయాళీ బ్యూటీ నటిగానే కాకుండా సింగర్‌గా కూడా ఆకట్టుకుంది. చిరంజీవి ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’లో ‘ఆకలేస్తే అన్నంపెడతా’, ఎన్టీఆర్‌ ‘రాఖీ’లో ‘రాఖీ రాఖీ..’ లాంటి సూపర్‌ హిట్‌పాటలు ఈ బ్యూటీ పాడినవే.

చింతకాల రవి, కేడీ చిత్రాల తర్వాత ఆమె టాలీవుడ్‌కి దూరమైంది. మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా టాలీవుడ్‌కి మాత్రం దాదాపు 11 ఏళ్లుగా దూరంగా ఉంది. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మమత.. రీసెంట్‌గా బైక్ రైడ్ చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో షేర్ చేసింది.. బైక్‌ని స్టైలిష్‌గా నడుపుతూ అదరగొట్టేసింది.

ఎవరో రైడ్‌కి తీసుకెళ్తారని వెయిట్ చెయ్యడం ఎందుకు? 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్.. కెరీర్ స్టార్టింగ్‌లో సినిమా ప్రయత్నాలు చేసేటప్పుడు మోటార్ సైకిల్ నడిపేదాన్నని పోస్ట్ చేసింది. ప్రస్తుతం మమత . తెలుగు - తమిళ్ - మలయాళంలో తెరకెక్కుతున్న 'లాల్ బాగ్' అనే సినిమాలో నటిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గా విస్తరిస్తున్న సాఫ్ట్ వేర్ అంశాన్ని హైలెట్ గా చూపించనున్నారాట. ఇక సమ్మర్ లో ఒకేసారి తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top