స్నేహం కోసమే ఆ పాత్రలు చేశాను | Vijay Sethupathi Maharaja second trailer promises an intense action flick | Sakshi
Sakshi News home page

స్నేహం కోసమే ఆ పాత్రలు చేశాను

Published Thu, Jun 13 2024 4:32 AM | Last Updated on Thu, Jun 13 2024 11:09 AM

Vijay Sethupathi Maharaja second trailer promises an intense action flick

– విజయ్‌ సేతుపతి 

‘‘మహారాజ’ నా కెరీర్‌లో 50వ సినిమా. ఈ యాభై చిత్రాల ప్రయాణంలో దాదాపు 500 వందలకు పైగా కథలు విన్నాను. ఎంతోమందిని కలిశాను. హిట్స్, ఫ్లాప్స్‌ చూశాను. ఫలితం ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. నేనిప్పటివరకూ చాలా పాత్రలు చేశాను. అయితే ‘మహారాజ’లో నా పాత్ర నా గత 
సినిమాలకి వైవిధ్యంగా ఉంటుంది. 

ఈ స్టోరీ, స్క్రీన్‌ ప్లే చాలా స్పెషల్‌గా ఉంటాయి’’ అని హీరో విజయ్‌ సేతుపతి అన్నారు. నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. మమతా మోహన్‌దాస్, అనురాగ్‌ కశ్యప్, అభిరామి ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనీసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్‌వీఆర్‌ సినిమా విడుదల చేస్తోంది. 

ఈ సందర్భంగా హీరో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ– ‘‘మహారాజ’ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే నా 50వ సినిమాగా ఈ కథ బాగుంటుందని చేశాను. నితిలన్‌ ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ‘కాంతార’కు సంగీతం అందించిన అజనీష్‌ లోకనాథ్‌ మా మూవీకి అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ‘మహారాజ’ని ఎన్‌వీఆర్‌ సినిమా వాళ్లు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. 

నేను క్యారెక్టర్‌ రోల్స్‌ తక్కువే చేశాను. అది కూడా ఫ్రెండ్స్‌ కోసం చేశాను. ‘ఉప్పెన’లో చాలా బలమైన పాత్ర నాది. దర్శకుడు రంజిత్‌ కోసమే ‘మైఖేల్‌’లో ఓ క్యారెక్టర్‌ చేశాను. చిరంజీవిగారిపై ఉన్న ఇష్టంతో ‘సైరా’ చేశాను. అలాగే రజనీకాంత్‌ సార్, విజయ్, షారుక్‌ ఖాన్‌గార్లపై నాకున్న ఇష్టంతో వారి సినిమాల్లో చేశాను. మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. తెలుగులో స్ట్రయిట్‌ సినిమాకి కథలు వింటున్నాను. ప్రస్తుతం తమిళ్‌లో మూడు సినిమాలు, హిందీలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement