బాయ్‌ఫ్రెండ్‌ కోసం వంట చేసిన శ్రుతీహాసన్‌.. పాపం

Viral: Shruti Haasan Cooks Dinner For Rumoured Boyfriend Santanu Hazarika - Sakshi

గత కొద్ది రోజులుగా హీరోయిన్‌ శ్రుతీ హాసన్‌, డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే శ్రుతీ, శంతనుతో కలిసి డేట్‌కు వెళ్లడం.. సోషల్‌ మీడియాలో ఒకరి గురించి ఒకరు పోస్టులు పెడుతూ.. తమ లవ్‌ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రపంచానికి వెల్లడించడం వంటివి చేస్నుత్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రుతీ హాసన్‌ బాయ్‌ఫ్రెండ్‌ కోసం స్వయంగా వంట చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.

ఇక బాయ్‌ఫ్రెండ్‌ కోసం శ్రుతి హాసన్‌ పైనాపిల్‌తో ఓ ప్రత్యేక వంటకాన్ని తయారు చేయాలని భావించింది. కానీ వంట చేసే సమయంలో ఏమరపాటుగా ఉండటంతో అవి కాస్త మాడిపోయాయి. ఇక శ్రుతీ చేసిన వంట చూసి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ‘‘ఇది వెస్టెడ్‌ పైనాపిలా‌ లేక రోస్టెడ్‌ పైనాపిలా’’ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

శంతను హజారికా గువహతికి చెందిన వ్యక్తి. అతను రాపర్, ఇలస్ట్రేటర్, డూడుల్ ఆర్టిస్ట్. త్వరలో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో కోసం శ్రుతి హాసన్‌తో కలిసి పని చేసినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో శంతను వెల్లడించాడు. అంతేకాక కొద్ది రోజుల క్రితం శ్రుతి హాసన్, శంతను హజారికా చెన్నైని సందర్శించారు. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేశారు. ఈ జంట శ్రుతి తండ్రి కమల్ హాసన్‌ను కూడా అతని ఇంట్లో కలుసుకున్నారు.

చదవండి: మళ్లీ ప్రేమలో శృతి.. అతడే బాయ్‌ఫ్రెండ్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top